|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

ఏపీ ఇంటర్ ఫలితాలు 2026 : ఏప్రిల్ మొదటి వారంలో విడుదల? రిజల్ట్స్ లింక్ మరియు పూర్తి వివరాలు ఇవే

​అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరీక్షా ఫలితాల ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చిలో జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు (BIEAP) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (Valuation) అత్యంత వేగంగా కొనసాగుతోంది. మార్చి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఏప్రిల్ తొలి వారంలో ఫలితాలను వెల్లడించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఫలితాలను ఎలా తనిఖీ చేసుకోవాలి?​

రిజల్ట్స్ విడుదలైన వెంటనే విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

అధికారిక వెబ్‌సైట్ ద్వారా :​

ముందుగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bieap-gov.org/index.html ఓపెన్ చేయాలి​.

హోమ్ పేజీలో “Inter Results 2026” అనే లింక్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి.

​విద్యార్థి తన హాల్ టికెట్ నంబర్ (Roll Number) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.

​’Submit’ బటన్ నొక్కగానే మార్కుల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది, భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకోవడం ఉత్తమం.

వాట్సాప్ ద్వారా సులభంగా :

సాంకేతికతను జోడిస్తూ ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే వెసులుబాటు ఉంది. ఇందుకోసం +91 95523 00009 అనే నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్‌లో ఈ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి, అక్కడ వచ్చే ఆప్షన్లలో ‘విద్యా సేవలు’ ఎంచుకుని, ‘AP Inter Exam Results 2026’ ద్వారా ఫలితాలు పొందవచ్చు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp