
హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) జూలై-2026లో నిర్వహించిన పీజీ (PG Results) ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కోర్సుల ఫలితాలను వర్సిటీ తన అధికారిక వెబ్సైట్లో శుక్రవారం అందుబాటులో ఉంచింది.
ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, చరిత్ర, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ తదితర విభాగాలకు చెందిన విద్యార్థులు తమ అడ్మిషన్ నంబర్ ద్వారా ఆన్లైన్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు చెక్ చేసుకునే విధానం
విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ braouonline.in ఓపెన్ చేసి ‘Exam Result’ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ‘PG (M.A, M.Com and M.Sc) I and II Year Examination Results July-2026’ లింక్‌పై క్లిక్ చేసి, తమ అడ్మిషన్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా మార్కులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రెండు సంవత్సరాల పీజీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో (CMM), ఒరిజినల్ డిగ్రీ (OD) సర్టిఫికెట్ల కోసం వెబ్‌సైట్‌లోని ‘Apply for Certificates’ లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇతర సమాచారం కోసం విద్యార్థులు తమ స్టడీ సెంటర్లను సంప్రదించవచ్చు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



