|  
FLASH NEWS
​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  •  Ramayana Movie : ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో భారీ మార్పులు.. ఆ సీన్లు, పాటలు కట్?  •  Election Commission : టీఎంసీలో వర్గపోరు.. మమత, రెబెల్ గ్రూపులకు కొత్త పేర్లు, గుర్తులు కేటాయించిన ఈసీ  •  Zombie Reddy 2 : జాంబీ ప్రపంచంలోకి రియల్ స్టార్ ఎంట్రీ.. పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో ఉపేంద్ర  •  IND vs AFG 3rd T20 : ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. సిరీస్ క్లీన్ స్వీప్  • 
Skip to content

Sontireddy Punna Reddy : విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి

హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం (Quthbullapur) పరిధిలో జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్డి (Sontireddy Punna Reddy) ఉత్సాహంగా పాల్గొన్నారు. మహదేవపురం, రుడా, మేస్త్రి నగర్, గాజులరామారం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మండపాల వద్ద నిర్వహించిన పలు అన్నదాన కార్యక్రమాల్లో కూడా పున్నారెడ్డి పాల్గొన్నారు. నిర్వాహకులు, స్థానిక ప్రజలతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని కాలనీవాసులు ఎంతో భక్తిభావంతో స్వామివారిని ఆరాధించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యాలతో ముందుకు సాగాలని కోరుకున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp