|  
FLASH NEWS
మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  •  Pawan Kalyan Health Update : ముగిసిన ఆయుర్వేద వైద్యం.. నెల రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్!  •  Kakinada Port : కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. రూ.65 లక్షల సరుకు సీజ్  •  Vijayawada Crime News : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దారుణ విషయాలు!  •  ​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  • 
Skip to content

మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!

విశాఖపట్నం, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రాష్ట్రంలో చేపట్టిన మెగా డీఎస్సీపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉన్నంతవరకు రాష్ట్రంలో అవినీతి జరగదని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ విజన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

అప్పులున్నా సంక్షేమం ఆగదు

ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యలే ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల భారీ స్థాయిలో అప్పులు ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై కొందరు కావాలనే లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, యువత ఇలాంటి వదంతులను నమ్మొద్దని ఆయన సూచించారు. పారదర్శకంగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

విశ్వనగరంగా విశాఖ..

28 వేల మందికి ఇళ్ల పట్టాలు సరికొత్త విజన్‌తో విశాఖపట్నం నగరాన్ని త్వరలోనే ఒక అద్భుతమైన విశ్వనగరం (గ్లోబల్ సిటీ)గా తీర్చిదిద్దబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన.. ఈ సందర్భంగా విశాఖలో సుమారు రూ.8,874 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలను 28,445 నిరుపేద కుటుంబాలకు అందజేశారు. ఈ భారీ పంపిణీ కార్యక్రమంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp