|  
FLASH NEWS
మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  •  Pawan Kalyan Health Update : ముగిసిన ఆయుర్వేద వైద్యం.. నెల రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్!  •  Kakinada Port : కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. రూ.65 లక్షల సరుకు సీజ్  •  Vijayawada Crime News : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దారుణ విషయాలు!  •  ​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  • 
Skip to content

Pawan Kalyan Health Update : ముగిసిన ఆయుర్వేద వైద్యం.. నెల రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్!

విజయవాడ, సూర్య న్యూస్ : దాదాపు నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) తిరిగి విజయవాడకు చేరుకున్నారు. కేరళలో ఆయుర్వేద చికిత్స ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి (Gannavaram Airport) చేరుకున్న ఆయనకు జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

కుడి భుజానికి సర్జరీ.. త్రిస్సూర్‌లో చికిత్స కుడి భుజానికి జరిగిన సర్జరీ అనంతరం వైద్యుల సూచనల మేరకు తదుపరి చికిత్స, విశ్రాంతి కోసం ఆయన ఆగస్టు 23వ తేదీన కేరళ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ త్రిస్సూర్ సమీపంలోని ఒక ప్రముఖ ఆయుర్వేద వైద్య కేంద్రంలో 21 రోజుల పాటు ప్రత్యేక చికిత్స తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో తిరిగి ఏపీకి చేరుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత డిప్యూటీ సీఎం రాష్ట్రానికి తిరిగి రావడంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇకపై ఆయన తిరిగి పాలనా వ్యవహారాలపై దృష్టి సారించడంతో పాటు, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొననున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp