|  
● FLASH NEWS
BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  •  Gachibowli: ప్రముఖ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం, విదేశీ యువతులు సహా ఆరుగురు అదుపులోకి  •  Netanyahu: ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని  •  HistoricWin: 406 పరుగుల రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన భారత్  •  PuneMurder: కేతన్ హత్య కేసులో సంచలనం.. మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితోనే స్కెచ్  • 
Skip to content

Warangal: వరంగల్ విమానాశ్రయానికి సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

హైదరాబాద్, సూర్య న్యూస్ : వరంగల్‌లో నూతనంగా నిర్మించనున్న మామునూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి (Warangal Airport) బహుజన యోధుడు ‘మహారాజ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్’ (Sarvai Papanna Goud) పేరును నామకరణం చేయాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాచారం గణేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రను, వరంగల్ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర పౌర విమానయాన శాఖకు ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించారు.

17వ శతాబ్దం చివర్లో మొఘల్ సామ్రాజ్య అధికారాలను సవాలు చేసిన శక్తివంతమైన స్థానిక నాయకుడిగా పాపన్న గౌడ్ చరిత్రలో నిలిచిపోయారని ఆయన గుర్తుచేశారు. పాపన్న చరిత్రకు కేంద్ర బిందువైన ఖిలాషాపూర్, షాపూర్ తదితర ప్రాంతాలు చారిత్రకంగా ఉమ్మడి వరంగల్ ప్రాదేశిక పరిధిలోకే వస్తాయని, అందువల్ల ఈ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం అత్యంత సముచితమని పేర్కొన్నారు.

బహుజన చరిత్రకు అంతర్జాతీయ గుర్తింపు

ఒక సాధారణ సామాజిక నేపథ్యం నుంచి వచ్చి బలమైన సైనిక శక్తిని నిర్మించిన పాపన్న చరిత్ర కేవలం ఒక సామాజిక వర్గానికి పరిమితమైంది కాదని గణేష్ స్పష్టం చేశారు. విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం ద్వారా తెలంగాణలోని అణగారిన వర్గాల ప్రజా చరిత్రకు, వీరత్వానికి అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ స్వాభిమానం తెలిసేలా ఈ నిర్ణయం ఉంటుందని తెలిపారు.

చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

విమానాశ్రయంలో అడుగుపెట్టే అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక చరిత్రను పరిచయం చేసేలా పాపన్న జీవిత చరిత్రతో కూడిన బహుభాషా గ్యాలరీని ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల ఖిలాషాపూర్ కోట వంటి చారిత్రక కట్టడాలకు పర్యాటక ప్రాధాన్యత పెరిగి, హెరిటేజ్ టూరిజం సర్క్యూట్‌గా మారుతుందని, ఫలితంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు.

ప్రముఖుల పేర్ల స్ఫూర్తితో..

రాంచీ విమానాశ్రయానికి బిర్సా ముండా, బెంగళూరుకు కెంపెగౌడ, ఏపీలోని భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టిన తరహాలోనే వరంగల్ విమానాశ్రయానికి కూడా స్థానిక చరిత్రకారుడి పేరు పెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ‘మహారాజ్ సర్వాయి పాపన్న గౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేసేలా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని యాచారం గణేష్ విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp