
హైదరాబాద్, సూర్య న్యూస్ : రైల్వే ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) శుభవార్త చెప్పింది. NTPC గ్రాడ్యుయేట్ లెవల్ రిక్రూట్‌మెంట్-2026 (NTPC Recruitment) కింద భారీ స్థాయిలో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తాజాగా ఒక షార్ట్ నోటీస్‌ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో మొత్తం 3,477 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్ఆర్‌బీ ప్రకటించింది. అక్టోబర్ 7వ తేదీన ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కానుండగా, అక్టోబర్ 8వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు
తాజాగా విడుదల చేసిన షార్ట్ నోటీస్ ప్రకారం.. అత్యధికంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు 2,750 ఉన్నాయి. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విభాగంలో 371 ఖాళీలు, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ విభాగంలో 300 పోస్టులు, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ కేటగిరీలో 56 చొప్పున ఖాళీలు ఉన్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. వీటికి సంబంధించిన వయోపరిమితి, ఫీజు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు అక్టోబర్ 7న వెలువడే పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలియనున్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



