
హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ లడ్డూ (Balapur Ganesh Laddu) వేలంలో ఈ ఏడాది కొత్త రికార్డ్ నమోదైంది. తీవ్ర పోటీ మధ్య జరిగిన ఈ వేలంలో సామా ప్రణీత్ రెడ్డి రికార్డు స్థాయిలో రూ. 39 లక్షలకు పాడుకుని లడ్డూను దక్కించుకున్నారు.
బ్రేక్ అయిన గతేడాది రికార్డు
గతేడాది జరిగిన వేలంలో బాలాపూర్ లడ్డూ అత్యధికంగా రూ.35 లక్షలు పలికింది. అయితే ఈ ఏడాది ఆ రికార్డు బద్దలై ఏకంగా రూ.39 లక్షలకు చేరుకోవడం విశేషం. వేలంలో విజేతగా నిలిచిన సామా ప్రణీత్ రెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు వినాయకుడి లడ్డూను లాంఛనంగా అందజేశారు.
అభివృద్ధి, సేవా పనులకు నిధులు
ఈ ప్రతిష్టాత్మక లడ్డూ వేలం ద్వారా వచ్చిన భారీ మొత్తాన్ని సద్వినియోగం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. బాలాపూర్ ప్రాంతంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులతో పాటు, ఆలయాల పరిరక్షణ మరియు ఇతర సేవా కార్యక్రమాల కోసం ఈ డబ్బును వినియోగించనున్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



