
ఢిల్లీ, సూర్య న్యూస్ : ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆలయాన్ని సందర్శించారు. ఢిల్లీలోని ప్రసిద్ధ శ్రీ వినాయక మందిరానికి వెళ్లిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగానికి ప్రధాని మోదీ భక్తిశ్రద్ధలతో అభిషేకం చేసి, స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం గణపతికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మరోవైపు, ప్రజా జీవితంలో 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మోదీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భంగా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనంగా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



