
హైదరాబాద్, సూర్య న్యూస్ : డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Dr. B.R. Ambedkar Open University) విద్యార్థులకు అధికారులు శుభవార్త చెప్పారు. డిగ్రీ, పీజీ ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ కీలక ప్రకటన చేశారు. సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థుల సౌలభ్యం కోసం ట్యూషన్ ఫీజు గడువును నవంబర్ 7వ తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డా.వై వెంకటేశ్వర్లు వెల్లడించారు.
2021 నుండి 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించి డిగ్రీ (బి.ఎ/బి.కాం/బిఎస్సీ) ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే, 2023 నుండి 2025 బ్యాచ్లలో పీజీ (ఎంఏ/ ఎం.కాం/ ఎమ్మెస్సీ, ఎం.బి.ఏ), డిప్లొమాలు, సర్టిఫికేట్ల కోర్సులలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కూడా ద్వితీయ సంవత్సరం ట్యూషన్ ఫీజును ఈ పెంచిన గడువులోపు చెల్లించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఫీజును టీఎస్, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా నేరుగా ఆన్లైన్లో చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ www.braouonline.in ను సందర్శించాలని, లేదా సమీపంలోని అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే 040-23680333, 444, 555 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



