
హైదరాబాద్, సూర్య న్యూస్ : నగరంలో వాటర్ ట్యాంకర్ల (Water Tankers) యజమానులు తమ సమ్మెను విరమించి నీటి సరఫరాను పునఃప్రారంభించడం పట్ల పలువురు హాస్టళ్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగుల నీటి కష్టాలను తీర్చడానికి ప్రత్యేక చొరవ చూపి, సమస్యను తక్షణమే పరిష్కరించిన హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) ఏ.వీ. రంగనాథ్‌ను కలిసి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ నగర పరిధిలో భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించేందుకు ఓఆర్ఆర్ (ORR) వెలుపలి ప్యూర్ ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సేకరించాలన్న ప్రభుత్వ సూచనను కూడా హాస్టల్ నిర్వాహకులు స్వాగతించారు. సమ్మె విరమణతో నగరంలోని ఐటీ కారిడార్ సహా పలు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి కొరతకు తాత్కాలికంగా తెరపడింది.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



