|  
● FLASH NEWS
Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  •  ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం.. ధ్వంసమైన కారు  • 
Skip to content

UPSC: సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూకు 2,526 మంది

సివిల్స్ మెయిన్స్ ఫలితాలు ఇంటర్వ్యూకు 2526 మంది

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2026 (Civil Services Mains) పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి 30 వరకు జరిగిన మెయిన్స్ రాత పరీక్షల ఆధారంగా మొత్తం 2,526 మంది అభ్యర్థులు తుది దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించినట్లు కమిషన్ ప్రకటించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌తో పాటు ఇతర కేంద్ర సర్వీసుల్లో 1,016 పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ జరుగుతోంది. ప్రిలిమ్స్ నుంచి 13,343 మంది మెయిన్స్‌కు ఎంపికైన విషయం తెలిసిందే.

ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in లోని ‘Written Results’ విభాగంలో చూసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్ల జాబితాను కమిషన్ పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థుల అభ్యర్థిత్వం తాత్కాలికమేనని, అన్ని అర్హతలు సరిపోలితేనే అది ఖరారవుతుందని కమిషన్ స్పష్టం చేసింది. ఇంటర్వ్యూకు వచ్చేటప్పుడు వయసు, విద్యార్హత, సామాజిక వర్గం, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ ధ్రువపత్రాల ఒరిజినల్స్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. రిజర్వేషన్ ప్రయోజనాలు కోరేవారు ప్రిలిమ్స్ దరఖాస్తు చివరి తేదీ అయిన 2026 ఫిబ్రవరి 27 నాటికి జారీ అయిన ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 11 నుంచి 25వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF) వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటిస్తామని, అవి న్యూఢిల్లీలోని ధోల్‌పూర్ హౌస్‌లో ఉన్న యూపీఎస్సీ కార్యాలయంలో జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఈ-సమన్ లెటర్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని, పోస్టు ద్వారా ఎలాంటి లేఖలు పంపబోమని పేర్కొంది. తుది ఫలితాలు వెలువడిన 15 రోజుల్లో అభ్యర్థులందరి మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ వెల్లడించింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp