|  
● FLASH NEWS
Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  •  ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం.. ధ్వంసమైన కారు  • 
Skip to content

CA: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. లక్ష మంది రాస్తే ఎంత మంది పాస్ అయ్యారో తెలుసా..?

CA Foundation సెప్టెంబర్ 2026 ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : ఛార్టర్డ్ అకౌంటెన్సీ (CA) ఫౌండేషన్ సెప్టెంబర్ సెషన్ ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షకు లక్షకు పైగా విద్యార్థులు హాజరుకాగా, కేవలం 18.93 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

19 వేల మంది మాత్రమే పాస్

ఐసీఏఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 1,04,240 మంది విద్యార్థులు సీఏ ఫౌండేషన్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో కేవలం 19,736 మంది విద్యార్థులు మాత్రమే విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు.

టాపర్లుగా కనిష్క, మహెక్ గుప్తా

ఈ ఫలితాల్లో కనిష్క గుప్తా, మహెక్ గుప్తా 361 మార్కులు సాధించి ఆల్ ఇండియా నంబర్.1 ర్యాంకర్లుగా నిలిచారు. కాగా, దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2, 5, 7, 9 తేదీల్లో పలు పరీక్షా కేంద్రాల్లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp