
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ ఇండియా ఫౌండేషన్ (MGGP India Foundation) డిప్యూటీ సెక్రటరీ జనరల్ మరియు గ్లోబల్ అంబాసిడర్గా అంబాసిడర్ డాక్టర్ గుడిదేవిని ప్రభాకర్ గౌడ్ (Dr. Gudidevini Prabhakar Goud) నియమితులయ్యారు. ఈ మేరకు నవంబర్ 6, 2026వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఫౌండేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ అంబాసిడర్ డాక్టర్ హృషీకేష్ ఆచార్య అధికారికంగా ప్రకటించారు.
శాంతి, మానవత్వం, స్వయం సమృద్ధి వంటి గాంధేయ సిద్ధాంతాలను సమాజంలో అమలు చేసేందుకు, విస్తృతంగా ప్రచారం చేసేందుకు డాక్టర్ ప్రభాకర్ గౌడ్ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఖండాంతరాలుగా శాంతి, మానవత్వం కోసం ఆయన చేస్తున్న విశేషమైన సేవలు, నిబద్ధతకు గుర్తింపుగా ఈ గ్లోబల్ అపాయింట్మెంట్ దక్కిందని సంస్థ ప్రతినిధులు కొనియాడారు. భారత ప్రభుత్వ ఎంసీఏ గుర్తింపుతో పాటు, ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన ఈ గాంధేయ సంస్థలో ఆయనకు ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



