
హైదరాబాద్, సూర్య న్యూస్ : చార్మినార్ (Charminar) వద్ద కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ (Congress) రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న కూన శ్రీశైలం గౌడ్.. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



