|  
● FLASH NEWS
Flydubai: విమానం కూల్చేయాలనేదే నా ప్లాన్.. కో-పైలట్ సంచలన నిజాలు  •  Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  • 
Skip to content

Sri Chaitanya School : వాష్ రూమ్‌లలో విద్యార్థుల చదువు.. శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఏబీవీపీ ధర్నా

కొంపల్లి, సూర్య న్యూస్: మేడ్చల్ జిల్లా (Medchal District) కొంపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ (Sri Chaitanya School) ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. కూకట్‌పల్లి విభాగ్, కొంపల్లి నగర శాఖ విద్యార్థి నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని వారు ఆరోపించారు.

​ఒకే క్యాంపస్‌లో మూడు బ్రాంచ్‌ల విద్యార్థులను కలిపి పాఠశాల నడుపుతున్నారని కూకట్‌పల్లి విభాగ్ కన్వీనర్ మండిపడ్డారు. తరగతి గదులు (Classrooms) సరిపోక ఏకంగా వాష్ రూమ్‌లను (Washrooms) తరగతులుగా మార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయల ఫీజులు (School Fees) వసూలు చేస్తున్నారని విమర్శించారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే పాఠశాల ఆవరణలో హాస్టల్ (Hostel) కూడా నిర్వహిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. మండల విద్యాశాఖ అధికారి (MEO) వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ చైతన్య కే5 (K5) పాఠశాలను సీజ్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ మృత్యుంజయ, కార్యకర్తలు వివేక్, చందు, కార్తీక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp