
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘స్నేహపూర్వక పోటీ’ అనే విధానానికి స్వస్తి పలకాలని అధికార కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరికి కేటాయించిన స్థానంలో ఆ పార్టీ అభ్యర్థే పోటీ చేయాలని, మిగతా రెండు మిత్రపక్షాలు ఆ అభ్యర్థి గెలుపు కోసమే నిబద్ధతతో పనిచేయాలని కూటమి సమన్వయ భేటీలో స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ స్థానం కేటాయించారో అక్కడే ఆ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలని, స్నేహపూర్వక పోటీలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. అభ్యర్థి గెలుపే ఏకైక లక్ష్యంగా మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
మరోవైపు, సీట్ల సర్దుబాటు సమయంలో తమ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తపడతామని, వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూనే పోటీ చేస్తామని జనసేన పార్టీ వెల్లడించింది. తమకు కేటాయించిన స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని భారతీయ జనతా పార్టీ (BJP) ధీమా వ్యక్తం చేసింది. మిగతా స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని కమలనాథులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



