
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరీక్షా ఫలితాల ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చిలో జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు (BIEAP) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (Valuation) అత్యంత వేగంగా కొనసాగుతోంది. మార్చి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఏప్రిల్ తొలి వారంలో ఫలితాలను వెల్లడించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఫలితాలను ఎలా తనిఖీ చేసుకోవాలి?
రిజల్ట్స్ విడుదలైన వెంటనే విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
అధికారిక వెబ్సైట్ ద్వారా :
ముందుగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://bieap-gov.org/index.html ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో “Inter Results 2026” అనే లింక్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి.
విద్యార్థి తన హాల్ టికెట్ నంబర్ (Roll Number) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
’Submit’ బటన్ నొక్కగానే మార్కుల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది, భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకోవడం ఉత్తమం.
వాట్సాప్ ద్వారా సులభంగా :
సాంకేతికతను జోడిస్తూ ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే వెసులుబాటు ఉంది. ఇందుకోసం +91 95523 00009 అనే నంబర్‌ను మొబైల్లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్‌లో ఈ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపి, అక్కడ వచ్చే ఆప్షన్లలో ‘విద్యా సేవలు’ ఎంచుకుని, ‘AP Inter Exam Results 2026’ ద్వారా ఫలితాలు పొందవచ్చు.