|  
● FLASH NEWS
Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  • 
Skip to content

BRAOU BEd Notification : డిగ్రీ అర్హతతో ఓపెన్ బీఈడీ చేసే ఛాన్స్… నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇవే.

Hyderabad, Surya News : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Dr. B.R. Ambedkar Open University) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed – ODL) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిస్టెన్స్ పద్ధతిలో బీఈడీ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు యూనివర్సిటీ పోర్టల్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపుల ప్రక్రియ జూలై 5, 2026 (05-07-2026) నుండి ప్రారంభం అవుతుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి జూలై 24 (24-07-2026) చివరి తేదీగా నిర్ణయించారు. ఐదు వందల రూపాయల (Rs. 500) ఆలస్య రుసుముతో జూలై 26 వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు.

ప్రవేశ పరీక్ష (Entrance Test) కోసం దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులైన (SC/ST/PWD) అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 750 చెల్లించాలి. ఆసక్తి గల వారు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ (www.braouonline.in) ద్వారా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు సమర్పించాలి.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఏ, బీఎస్సీ, బీకామ్ లేదా బీటెక్ (BA/BSc/BCom/BTech) వంటి డిగ్రీ కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో ఇన్-సర్వీస్ టీచర్లు లేదా ఎన్‌సిటిఈ (NCTE) గుర్తింపు పొందిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ కోర్సుకు అర్హులు. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.

​ఈ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో (Computer Based Test) నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం కేవలం తెలుగు మాధ్యమంలో (Telugu Medium) మాత్రమే ఇస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 మార్కులు, తెలుగు 25 మార్కులు, జనరల్ మెంటల్ ఎబిలిటీ 50 మార్కులకు ఉంటాయి.

​ఈ ఓపెన్ బీఈడీ కోర్సు కాలవ్యవధి రెండు సంవత్సరాలు (2 Academic years) ఉంటుంది. ఈ రెండేళ్ల ప్రోగ్రామ్ కోసం మొత్తం ట్యూషన్ ఫీజు (Tuition Fee) రూ. 40,000 నిర్ణయించారు. అడ్మిషన్ సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆగస్టు మొదటి వారంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 29 నుండి హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp