ఢిల్లీకి తెలంగాణ కేబినెట్: ఆత్మగౌరవ అంశంపై రాజకీయ దుమారం
తెలంగాణ కేబినెట్ మొత్తం ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర ఆత్మగౌరవానికి అవమానమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో రాజకీయ దుమారం రేగింది
తెలంగాణ కేబినెట్ మొత్తం ఢిల్లీకి వెళ్లడం రాష్ట్ర ఆత్మగౌరవానికి అవమానమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో రాజకీయ దుమారం రేగింది
మరుగుజ్జు సమాజం ఎదుర్కొంటున్న బీసీ రిజర్వేషన్ల సమస్యపై తీన్మార్ మల్లన్న చర్చించి 20 వేల రూపాయల సాయం అందజేశారు
ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలు మరియు సాంకేతికతపై చర్చించేందుకు ఓయూలో 100 మంది వైస్ ఛాన్సలర్ల సమావేశం ప్రారంభం అయింది.
సైబర్ నేరాల బాధితులకు ఊరటనిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ ‘సి-మిత్ర’ వర్చువల్ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బాధితులు తమ ఇంటి నుండే ఆన్‌లైన్ ద్వారా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసుకోవచ్చు. ఏఐ (AI) సాంకేతికతతో ఫిర్యాదు పత్రాన్ని సిద్ధం చేసే ఈ సరికొత్త విధానం ద్వారా ఇప్పటికే వందకు పైగా కేసులు నమోదయ్యాయి.
ఆధ్వర్యంలో ‘యువ ఆపద మిత్ర’ మూడవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫతుల్‌గూడలో 105 మంది వాలంటీర్లకు విపత్తు నిర్వహణ మరియు ప్రాణరక్షణ మెలుకువలపై అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య కీలక దిశానిర్దేశం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చేలా వారం రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యశాల హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. జాతీయ నేతలు బి.ఎల్. సంతోష్, తరుణ్ చుగ్‌లతో కలిసి పార్టీ నేత ఎన్. రామచందర్ రావు బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించారు. దక్షిణాదిలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా ఈ శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తూ మరో కీలక ముందడుగు వేసింది. టీసీఎస్ ఐఓన్ (TCS iON) భాగస్వామ్య సంస్థల్లో ఎంపికైన విద్యార్థులకు రేపు (ఫిబ్రవరి 19) మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపస్‌లో వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి ఆఫర్ లెటర్లు అందజేయనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
పుణె ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో పార్లమెంటరీ అధికార భాషా కమిటీ తనిఖీలు చేపట్టింది. అధికార భాషా అమలులో ప్రతిభ కనబరిచినందుకు గాను ఆసుపత్రి యాజమాన్యానికి కమిటీ ప్రశంసా పత్రం అందజేసింది.
ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్ ORR పరిధిని నెట్ జీరో జోన్‌గా మారుస్తామని, కాలుష్య పరిశ్రమలను నగరం వెలుపలికి తరలిస్తామని వెల్లడించారు. క్లైమేట్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడంలో గ్రీన్ ఎనర్జీ పాత్రను ఆయన నొక్కి చెప్పారు.
రంజాన్ మాసం రాకముందే చార్మినార్ పరిసరాలను అద్దంలా తీర్చిదిద్దాలని అధికారులకు జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్. వి. కర్ణన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నగర రూపురేఖలు మార్చాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించబోనని అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సరికొత్త టెక్నాలజీ. ఏఐ ద్వారా బోగస్ దరఖాస్తుల గుర్తింపు. ఏప్రిల్ నుంచి మంజూరు పత్రాల పంపిణీ.