|   
🔴 BREAKING NEWS ► TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం! Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్ Telangana ACB Raids : తెలంగాణలో ఏసీబీ భారీ వేట.. డీఎస్పీ ఇంట్లో 200 కోట్ల కుబేర గుట్టు రట్టు, దొరికిన డైరీలో సంచలన నిజాలు
Skip to content

యువ ఆపద మిత్రులతో సమాజానికి భరోసా: హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య

ఫతుల్‌గూడలో మూడవ బ్యాచ్ శిక్షణ ప్రారంభం.. 105 మంది వాలంటీర్లకు వారం రోజుల పాటు మెలుకువలు

హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడంలో యువ ఆపద మిత్రులు కీలక పాత్ర పోషించాలని హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఫతుల్‌గూడలోని హైడ్రా శిక్షణ కేంద్రంలో ‘యువ ఆపద మిత్ర’ మూడవ బ్యాచ్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

తక్షణ సహాయమే లక్ష్యం:

వరదలు, అగ్ని ప్రమాదాల వంటి ఆపద సమయాల్లో స్థానికంగా ఉండే వాలంటీర్లే మొట్టమొదట స్పందిస్తారని, వారు సమర్థ నాయకులుగా వ్యవహరించాలని పాపయ్య సూచించారు. ఫిబ్రవరి 18 నుండి 24 వరకు జరిగే ఈ శిక్షణలో ప్రాణరక్షణ మెలుకువలు, ప్రాథమిక చికిత్స మరియు సహాయక బృందాలతో కలిసి పనిచేసే విధానంపై శిక్షణ ఇస్తామన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు మరో 10 మందిని సిద్ధం చేసి ప్రజల్లో భరోసా నింపాలని కోరారు.

రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 105 మంది యువ వాలంటీర్లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాల వంటి సమయాల్లో గందరగోళం లేకుండా ఎలా నాయకత్వం వహించాలనే అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు జయప్రకాశ్, గౌతమ్, ఎస్‌డీఎంఏ నోడల్ ఆఫీసర్ గౌతం, యూత్ ఆఫీసర్ ఖుష్బూ, ఏడీఎఫ్‌వో మోహనరావు తదితరులు పాల్గొని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp