|   
🔴 BREAKING NEWS ► Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో
Skip to content

Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా

Hyderabad, Surya News: నగరంలో ఆహార కల్తీపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తినే అన్నంలో కల్తీలు, తాగే పాలలో రసాయనాలు కలుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారి భరతం పడుతున్నారు. ఈ ముప్పును అరికట్టేందుకు హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్ టీమ్‌ (H-FAST) ఏర్పాటై వంద రోజులు పూర్తయింది. మార్చి 19న ఏర్పాటైన ఈ ప్రత్యేక విభాగం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర దాడులు చేస్తోంది.

Food Adulteration in Hyderabad : 100 రోజుల దాడుల్లో విస్తుపోయే నిజాలు

​టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది అధికారులతో కూడిన హెచ్‌-ఫాస్ట్‌ విభాగం క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్లలో మొత్తం 185 కేసులు నమోదు చేశారు. సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదు అయ్యాయి. గోల్కొండలో 44, సికింద్రాబాద్‌లో 35, చార్మినార్‌లో 21, శంషాబాద్‌లో 13, జూబ్లీహిల్స్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 5 కేసులు నమోదయ్యాయి.

స్వాధీనం చేసుకున్న పదార్థాల వివరాలు చూస్తే వ్యాపారులు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో స్పష్టం అవుతోంది. నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో భారీగా నకిలీ నిల్వలను పట్టుకున్నారు. ఇక్కడ ఏకంగా 27,024 కిలోల కల్తీ పేస్ట్ పట్టుబడింది. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కిలోల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాలకు సంబంధించిన 6 కేసుల్లో 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పచ్చళ్లు, కల్తీ కోవా, నకిలీ టీ పొడి, కల్తీ నెయ్యి, పనీర్ వంటి వాటిని కూడా పెద్ద ఎత్తున పట్టుకున్నారు. మరో 247 కేసులను తదుపరి చర్యల కోసం జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు.

పీడీ యాక్ట్ తప్పదు – పోలీసుల కఠిన హెచ్చరిక​

ఆహార కల్తీని కేవలం వ్యాపార మోసంగా పరిగణించడం లేదని సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ఇది అమాయకుల ప్రాణాలతో ఆడుకునే హత్యాయత్నంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. కల్తీ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పిలుపునిచ్చారు. కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేయవచ్చు. లేదంటే హెచ్-ఫాస్ట్ వాట్సాప్ నంబర్ 8712661212 కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp