|  
FLASH NEWS
YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు  •  నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  • 
Skip to content

​రూ. 56 లక్షలతో చెక్కేసిన డ్రైవర్.. విమానమెక్కబోతుండగా పోలీసులు ఏం చేశారో తెలుసా?

హైదరాబాద్, ఫిబ్రవరి 24: గచ్చిబౌలిలో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుండి రూ. 56 లక్షల నగదుతో పరారైన డ్రైవర్ బాడిగెరె అజిత్ కుమార్ ఉదంతం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా సాగిన ఈ దొంగతనం చివరకు పోలీసుల వ్యూహాత్మక ఆపరేషన్‌తో ముగిసింది. నగదుతో మాయమైన కిలాడీ డ్రైవర్‌ను సైబరాబాద్ పోలీసులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద చాకచక్యంగా పట్టుకున్నారు.

రాష్ట్రాలు దాటిన వేట

చోరీ జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు తప్పించుకోవడానికి పలు రాష్ట్రాలు మారుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. అయితే అతడి కదలికలను నిశితంగా గమనించిన పోలీసులు, అతను దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నాడనే పక్కా సమాచారంతో అక్కడే మాటువేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి రూ. 34.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

భద్రతా సంస్థపై వేటు

ఈ ఘటనలో నగదు రవాణా చేస్తున్న ‘సంగం సెక్యూరిటీ ఏజెన్సీ’ నిబంధనలను పాటించలేదని పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం (PSARA) కింద సదరు సంస్థపై కఠిన చర్యలు ప్రారంభించారు. మరోవైపు, ఈ కేసులో నిందితుడి ఆచూకీ కోసం కీలక సమాచారం అందించిన ఎస్వీఆర్ ట్రావెల్స్ ప్రతినిధి ఉమాకాంత్‌ను పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp