Skip to content

Gade Saikrishna Missing Case : గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలనాలు.. రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు

Vijayawada, Surya News: గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు (Gade Saikrishna Missing Case) తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో అరెస్టయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో పోతర్లంక అశోక్ కుమార్, జంగం నాని నిజాలు దాచిపెట్టారని పోలీసులు స్పష్టం చేశారు.

జంగం నాని చికిత్స కోసం కోస్తా ఆసుపత్రికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి నుండి నానిని అశోక్ తన ద్విచక్ర వాహనంపై కంకిపాడు వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మార్కాపురం (Markapuram) నుండి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చిన సాయికృష్ణ ఏమయ్యాడనేది ఇప్పుడు ప్రధాన మిస్టరీగా మారింది. ఈ విషయాన్ని వెలికితీయాల్సిన అవసరం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

​ఈ కేసు దర్యాప్తు కోసం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్, కానిస్టేబుళ్లు మురళీకృష్ణ కుమార్, బోస్తా రాంబాబు, కృష్ణలంక కానిస్టేబుల్ బాబూరావు మార్కాపురం వెళ్లారు. మే ఐదో తేదీ రాత్రి 7:39 గంటల సమయంలో సాయికృష్ణ మొబైల్ టవర్ లొకేషన్ మార్కాపురంలోని వడ్డే బజార్ లో చూపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మరుసటి రోజు మే ఆరో తేదీ తెల్లవారుజామున 3:53 గంటలకు కానిస్టేబుల్ బాబూరావు మొబైల్ టవర్ లొకేషన్ కూడా మార్కాపురంలోనే చూపించింది.

నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) అమలు కోసం తీసుకువచ్చిన నిందితుడిని, కోర్టులో హాజరుపరిచే గడువుకు ముందు నిర్బంధంలో ఉంచారని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో (FIR) ఉన్న నిందితులంతా కలిసి పథకం ప్రకారం సాయికృష్ణను అదృశ్యం చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఇంకా సమగ్ర విచారణ జరిపి పూర్తి సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

📲 Join WhatsApp