|  
● FLASH NEWS
VijayDeverakonda: ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్  •  Nobel: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌పై సెటైర్లు  •  Bypolls: ముస్లిం మెజార్టీ స్థానాల్లో బీజేపీ హవా  •  KCR: సీఎం రేవంత్‌పై వ్యూహం మార్చిన కేసీఆర్.. టార్గెట్ కొడంగల్!  •  NFSC : ఫెలోషిప్‌ల జాప్యంపై యువ న్యాయవాది పోరాటం  • 
Skip to content

GO 59: జీవో 59 దరఖాస్తుదారులకు మంత్రి పొంగులేటి గుడ్‌న్యూస్

హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని, క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) శుభవార్త చెప్పారు. 500 గజాలలోపు ఉన్న జీవో 59 (GO 59) దరఖాస్తులన్నింటికీ కేవలం నెల రోజుల్లోనే పరిష్కారం చూపుతామని ఆయన స్పష్టం చేశారు.

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సత్వర పరిష్కారం కోసం అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు క్రమబద్ధీకరణ మార్గదర్శకాలతో అధికారికంగా మెమో నంబర్ 48030ని విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

జీవో 59 అమలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు తావులేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం, అత్యంత పారదర్శకంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని, అర్హులైన దరఖాస్తుదారులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp