|  
FLASH NEWS
Election Commission SIR Notices : అద్వానీ, జైశంకర్ సహా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు.. అసలేమిటీ ‘సర్’ (SIR) ప్రక్రియ?  •  Houthi Attacks on Saudi Arabia : సౌదీ అరేబియాపై హౌతీ రెబల్స్ భీకర దాడులు.. పాకిస్థాన్, తుర్కియేలకు తీవ్ర హెచ్చరికలు!  •  Rahul Gandhi Comments : లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూతబడ్డాయి.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!  •  NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  • 
Skip to content

IIT Bombay Student Suicide : ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య.. తెలుగు ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు!

ముంబై, సూర్య న్యూస్ : ఐఐటీ బాంబే (IIT Bombay) క్యాంపస్‌లో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, నిరసనలకు ఐఐటీ మేనేజ్‌మెంట్ ఎట్టకేలకు దిగివచ్చింది. విద్యార్థి మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డీన్, ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల (Professor Suryanarayana Doolla)ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి దర్యాప్తు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ వేటు అమలులో ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది.

ఏం జరిగిందంటే..

బీటెక్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల సాహిల్ వాకోడే.. గత శుక్రవారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిడ్ సెమిస్టర్ పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించి చాట్ జీపీటీ ద్వారా పరీక్షా పత్రానికి సంబంధించిన సమాధానాలు వెతకడానికి ప్రయత్నించాడనే ఆరోపణలు అతనిపై వచ్చాయి. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే సాహిల్ బలవన్మరణానికి పాల్పడటం క్యాంపస్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది.

ప్రొఫెసర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

సాహిల్ మృతిపై అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల గత కొంతకాలంగా సాహిల్‌ను కులం పేరుతో దూషిస్తూ, తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని సాహిల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రొఫెసర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఐఐటీ బాంబే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో విద్యాభ్యాసం

ఈ వివాదంలో చిక్కుకున్న ప్రొఫెసర్ సూర్యనారాయణకు ఐఐటీ బాంబేలో మంచి అకడమిక్ ట్రాక్ రికార్డు ఉంది. పవర్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానం వంటి సంక్లిష్ట విభాగాల్లో ఆయన నిపుణుడిగా గుర్తింపు పొందారు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి 2000 సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్, ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, కాకినాడ జేఎన్‌టీయూలో కూడా ఆయన చదివారు.

ఐఐటీ బాంబేలో చేరడానికి ముందు బెంగళూరులోని పవర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్స్ సంస్థతో పాటు హైదరాబాద్‌లో కూడా పనిచేశారు. విద్యార్థులకు బోధనలో చూపిన ప్రతిభకు గాను ఆయనకు 2017లో, అలాగే 2021లో ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అవార్డులు లభించాయి. బోధనకే పరిమితం కాకుండా ఐఐటీ బాంబేలో హాస్టల్ వార్డెన్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ బాధ్యతలను కూడా ఆయన నిర్వహించారు. తాజాగా విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఆయన కెరీర్ వివాదంలో చిక్కుకుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp