
హైదరాబాద్, సూర్య న్యూస్: రాష్ట్రంలోని సాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో (Telangana Secretariat) నీటి పారుదల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Irrigation Secretary) శ్రీధర్ (IAS Sridhar) ను తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ (Molkapuri Srikanth Goud) కలిశారు.
పంటలు కోతకు వచ్చే తరుణంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని, ఈ నెల ఆఖరి వరకు చివరి ఆయకట్టు పొలాలకు నీళ్లు అందించాలని మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తలూరి కృష్ణమూర్తి గౌడ్ విజ్ఞప్తి చేశారు. నీరు అందక రైతులు ఆందోళనలో ఉన్నారని వారు ఐఏఎస్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.
శ్రీధర్ ఐఏఎస్ తక్షణ స్పందన:
గౌడ విద్యార్థి సంఘం నాయకుల విజ్ఞప్తిపై ఐఏఎస్ శ్రీధర్ సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే నీటిని విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పంట పొలాలకు సకాలంలో నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపిన ఐఏఎస్ శ్రీధర్ కు తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం పక్షాన నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.