|  
FLASH NEWS
సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  •  AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల  •  అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు  •  Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ  • 
Skip to content

Telangana News : రైతన్నలకు ఊరట.. పంట పొలాలకు నీటి విడుదలపై ఐఏఎస్ శ్రీధర్ కీలక ఆదేశాలు

హైదరాబాద్, సూర్య న్యూస్: రాష్ట్రంలోని సాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో (Telangana Secretariat) నీటి పారుదల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Irrigation Secretary) శ్రీధర్ (IAS Sridhar) ను తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ (Molkapuri Srikanth Goud) కలిశారు.

పంటలు కోతకు వచ్చే తరుణంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని, ఈ నెల ఆఖరి వరకు చివరి ఆయకట్టు పొలాలకు నీళ్లు అందించాలని మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తలూరి కృష్ణమూర్తి గౌడ్ విజ్ఞప్తి చేశారు. నీరు అందక రైతులు ఆందోళనలో ఉన్నారని వారు ఐఏఎస్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

శ్రీధర్ ఐఏఎస్ తక్షణ స్పందన:

గౌడ విద్యార్థి సంఘం నాయకుల విజ్ఞప్తిపై ఐఏఎస్ శ్రీధర్ సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే నీటిని విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పంట పొలాలకు సకాలంలో నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపిన ఐఏఎస్ శ్రీధర్ కు తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం పక్షాన నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp