|   
🔴 BREAKING NEWS ► TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. అసలు కారణం ఇదే
Skip to content

టీవీ సౌండ్ తెచ్చిన తంటా: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో (TIDCO) కాలనీలో గురువారం రాత్రి ఒక చిన్న గొడవ పెను విషాదానికి దారితీసింది. కేవలం టీవీ వాల్యూమ్ తగ్గించమన్నందుకు ఒక భార్య తన భర్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ అహ్మద్ (27) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ తన భార్య క్రాంతి మరియు ఇద్దరు పిల్లలతో కలిసి టిడ్కో కాలనీలో నివసిస్తున్నాడు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న అహ్మద్ గురువారం రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో భార్య టీవీ చూస్తోంది. వాల్యూమ్ ఎక్కువగా ఉండటంతో దానిని తగ్గించాలని అహ్మద్ కోరాడు. ఈ చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.

గొడవ తీవ్రం కావడంతో ఆవేశానికి లోనైన క్రాంతి ఇంట్లోని కత్తితో అహ్మద్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను స్థానికులు వెంటనే చినకాకాని ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంగళగిరి సీఐ సామవేదం ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చిన్నపాటి గొడవ ఇద్దరు చిన్నారులను అనాథలను చేయడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp