|   
🔴 BREAKING NEWS ► Dharmendra Pradhan Resigns : కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, దేశ రాజకీయాల్లో సంచలనం PM Modi Latest Video : మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. Supreme Court Guidelines : కోర్టు వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు Police Job Aspirant Arrested : నిరుద్యోగుల బంద్ ఎఫెక్ట్.. హాస్టల్ వద్దే పోలీస్ అభ్యర్థి నవీన్ పట్నాయక్ అరెస్ట్ Delhi Police Warning : ఆందోళనకారులకు ఢిల్లీ పోలీసుల సంచలన వార్నింగ్.. ఆ తప్పు చేశారో ఇక మీ పాస్‌పోర్ట్ రద్దే
Skip to content

బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్ గూటికి మేడ్చల్ జిల్లా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు

కుత్బుల్లాపూర్:రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతోంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ సమక్షంలో మన్నె రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.

అభివృద్ధికి ఆకర్షితులయ్యే చేరిక: భూపతిరెడ్డి

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో పాత, కొత్త నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి, రషీద్, లక్ష్మ రెడ్డి, బట్ట పాలకృష్ణ, మైసి గారి శ్రీనివాస్, ఆలేటి శ్రీనివాస్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp