
చెన్నై, సూర్య న్యూస్ : దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్స్ (Electoral Bonds) ద్వారా అత్యధిక విరాళాలు ఇచ్చిన వ్యక్తిగా సంచలనం సృష్టించిన లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భార్య, కొడుకు, అల్లుడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం విశేషం.
శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి 60 వేల ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆమె కుమారుడు జోస్ చార్లెస్ పుదుచ్చేరిలోని కామరాజ్ నగర్ నుంచి ఎల్జేకే (LJK) పార్టీ తరఫున పోటీ చేసి 16 వేల ఓట్లతో గెలుపొందారు. ఇక మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున తమిళనాడులోని విల్లివాక్కం నుంచి టీవీకే (TVK) పార్టీ నుంచి పోటీ చేసి 66 వేల ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
భారీగా విరాళాలు
ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కావడం ఒక ఎత్తు అయితే, వీరు మూడు వేర్వేరు పార్టీల నుంచి గెలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడులోని డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీలకు మార్టిన్కు చెందిన టైగర్ అసోసియేట్స్ సంస్థ రూ.260 కోట్ల డొనేషన్లు ఇచ్చింది. ఇందులో ఏఐఏడీఎంకేకు రూ.135 కోట్లు, డీఎంకేకు రూ.125 కోట్లు అందినట్లు సమాచారం.
ఎవరీ మార్టిన్?
కోయంబత్తూరుకు చెందిన శాంటియాగో మార్టిన్ 1991లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అనే కంపెనీని ప్రారంభించారు. కేవలం 13 ఏళ్ల వయసులోనే లాటరీలు అమ్మడం ప్రారంభించిన ఆయన, క్రమంగా వ్యాపారాన్ని విస్తరించి ‘లాటరీ కింగ్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచారు. రియల్టీ, ఇన్ఫ్రా, టెక్స్టైల్స్, హోటల్స్ వంటి వివిధ రంగాల్లో దేశ, విదేశాల్లో ఆయనకు భారీగా వ్యాపారాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు తన కంపెనీల ద్వారా అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను (రూ.1300 కోట్లకు పైగా) కొనుగోలు చేసిన వ్యక్తిగా ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



