|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

NICL: నేషనల్ ఇన్సూరెన్స్‌లో 321 ఆఫీసర్ పోస్టులు.. రేపటి నుంచే దరఖాస్తులు

హైదరాబాద్, సూర్య న్యూస్ : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) భారీగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు గాను 321 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (Administrative Officer) పోస్టులకు తాజాగా షార్ట్ నోటీస్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ అక్టోబర్ 8న విడుదల కానుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఫైనాన్స్, లీగల్, ఐటీ, రిస్క్ ఇంజనీర్స్, అగ్రికల్చర్, కంపెనీ సెక్రటరీస్ తదితర కీలక విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు నోటీసులో స్పష్టం చేశారు.

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 82,485 బేసిక్ పేతో ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. రాతపరీక్షల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుండగా, నవంబర్ 17న, అలాగే డిసెంబర్ 22న పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఇతర పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం అభ్యర్థులు nationalinsurance.nic.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp