|  
● FLASH NEWS
Drugs: డ్రగ్స్ ముఠాలకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక.. ఇక ఆస్తులపైనే గురి!  •  Congress: సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు.. కేపీ వివేకానంద్ ఫైర్  •  Trump: ఇరాన్‌పై దాడులకు తొందరపడొద్దన్న ట్రంప్  •  BRS: సిద్దిపేట సభ అట్టర్ ఫ్లాప్.. రేవంత్‌పై గట్టు రాంచందర్ రావు ఫైర్  •  Chukka: చుక్కా రామయ్య సలహాలతో ముందుకెళ్తాం.. సీఎం రేవంత్ వెల్లడి  •  JEE: సెషన్-1 దరఖాస్తు గడువు ముగింపు.. అభ్యర్థులకు అలర్ట్  • 
Skip to content

Photojournalism: ఫోటో జర్నలిస్టులే చరిత్రకు సాక్షులు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఫోటో జర్నలిస్టులు కేవలం చిత్రాలను బంధించేవారు మాత్రమే కాదని, సమాజంలో చోటుచేసుకునే ఘటనలకు, చరిత్రలో నిలిచిపోయే సందర్భాలకు ప్రత్యక్ష సాక్షులని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఫోటో జర్నలిస్టులు పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TSPJA) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ ఫోటో జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవం–2026 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ ప్రసాద్ కుమార్ ఫోటో జర్నలిస్టుల సేవలను ప్రశంసించారు.

ప్రజల పక్షాన నిలవాలి.. నిజాన్ని చూపాలి

ప్రమాదకర పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫోటో జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారని స్పీకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక కీలక సంఘటనలను తమ కెమెరాల్లో బంధించి ప్రజలకు అందించడంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. “కెమెరా ఎప్పుడూ నిజం వైపే గురి పెట్టాలి.. ఆలోచన ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలి” అని పిలుపునిచ్చారు.

మాచర్ల నాగేశ్వరరావుకు రాష్ట్రస్థాయి అవార్డు

ఈ సందర్భంగా కూకట్‌పల్లికి చెందిన ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ మాచర్ల నాగేశ్వరరావుకు రాష్ట్ర ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందజేశారు. అవార్డు ప్రదానోత్సవంలో అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఫోటో జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పీకర్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులు వృత్తిపరమైన నిబద్ధతతో ప్రజలకు వాస్తవాలను అందించాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు