|   
🔴 BREAKING NEWS ► Pakistan Airstrikes : అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం, ఘాటుగా స్పందించిన భారత్ Telangana ACB Raids : తెలంగాణలో ఏసీబీ భారీ వేట.. డీఎస్పీ ఇంట్లో 200 కోట్ల కుబేర గుట్టు రట్టు, దొరికిన డైరీలో సంచలన నిజాలు Telangana Weather Alert : తెలంగాణలో ఆ 5 జిల్లాలకు భారీ వర్ష గండం.. 20 జిల్లాల్లో ఉరుములతో ఐఎండీ వార్నింగ్
Skip to content

PV Narasimha Rao Memorial Lecture : అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఘనంగా పీవీ స్మారకోపన్యాసం.. ప్రసంగించిన సురభి వాణీదేవి

హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) లో నేడు భారతరత్న శ్రీ పి.వి. నరసింహారావు (PV Narasimha Rao) స్మారక ఉపన్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. క్యాంపస్ లోని డా.సి.నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేధావులు, విద్యావేత్తలు విశేషంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థికవేత్త, ప్రజా మేధావి డా. పరకాల ప్రభాకర్ (Dr Parakala Prabhakar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. “SIR 2025–26: ఇది భారతదేశ భావనను ఛిన్నాభిన్నం చేస్తుందా?” అనే అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. దేశ ప్రస్తుత పరిస్థితులపై ఆయన చేసిన ప్రసంగం ఆలోచింపజేసేలా సాగింది.

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

​ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి (Surabhi Vani Devi) ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సభను ఉద్దేశించి ప్రసంగించారు. పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను, ఆయన ఆలోచనా విధానాన్ని ఆమె గుర్తు చేశారు.

​ఈ విశేష కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ (Vice Chancellor) ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. అలాగే అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు.

📲 Join WhatsApp