బీఆర్ఎస్కు షాక్: కాంగ్రెస్ గూటికి మేడ్చల్ జిల్లా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు
మేడ్చల్ జిల్లా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ చేరికతో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
