|  
● FLASH NEWS
Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  •  Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం  • 
Skip to content

Telangana Court Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగ అవకాశాలు.. ఎవరికంటే?

Hyderabad, Surya News: నిరుద్యోగులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ (Offline) విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ప్యానెల్ అడ్వకేట్ (Panel Advocate) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో తెలంగాణ హైకోర్టు (High Court) పరిధిలో 06 పోస్టులు ఉన్నాయి. క్యాట్ (CAT) హైదరాబాద్ లో 3 ఖాళీలు కేటాయించారు. అలాగే ఈఎస్ఐ కోర్టులో (ESI Court) 8 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎం కోర్టు (MM Court) సికింద్రాబాద్ పరిధిలో మరో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

​ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ (LLB) పూర్తి చేసి ఉండాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్ లో విధిగా సభ్యత్వం కలిగి ఉండాలి. అలాగే నిరంతరం న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ (Practice) చేస్తూ ఉండాలి.

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్లైన్ పద్ధతిలో పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్లను రీజనల్ డైరెక్టర్ (Legal), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), రీజనల్ ఆఫీస్, తెలంగాణ, హిల్ ఫోర్ట్, ఆదర్శ్ నగర్, హైదరాబాద్ (Hyderabad), తెలంగాణ – 500063 చిరునామాకు పంపాలి. దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 14వ తేదీని చివరి తేదీగా (Last Date) నిర్ణయించారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification), ఎలిజిబిలిటీ, మరియు అనుభవం (Experience) ఆధారంగా ఎంపిక చేస్తారు. అవసరమైతే అభ్యర్థులకు ఇంటర్వ్యూ (Interview) కూడా నిర్వహించే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం అభ్యర్థులు rotelangana.esic.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp