|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

Thalapathy Vijay : జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ మే 7న ముఖ్యమంత్రిగా దళపతి ప్రమాణస్వీకారం

చెన్నై, సూర్య న్యూస్ : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో దళపతి విజయ్ (Thalapathy Vijay) సరికొత్త చరిత్ర సృష్టించారు. కేవలం పార్టీ పెట్టిన రెండేళ్లలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఎంజీఆర్ తర్వాత సినీ రంగం నుంచి వచ్చి తొలి ఎన్నికల్లోనే అద్భుత విజయం సాధించిన నేతగా విజయ్ నిలిచారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 చోట్ల గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కి టీవీకే కేవలం 10 స్థానాల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ (Congress), పీఎంకే, లెఫ్ట్ మరియు వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి మద్దతు ఇస్తున్న 10 మంది ఎమ్మెల్యేల వివరాలపై అధికారిక ప్రకటన రాకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.

ఈ క్రమంలో మే 7న చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరగనుంది. దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ పార్టీలైన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) పార్టీలు ఈ ఎన్నికల్లో రెండు, మూడో స్థానాలకు పరిమితం అయ్యాయి. సంక్షేమ పథకాలు, సెంటిమెంట్ రాజకీయాలు తమను గెలిపిస్తాయని నమ్మిన అధికార డీఎంకేకు ప్రజలు షాక్ ఇచ్చారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రస్తుత సీఎం స్టాలిన్ (MK Stalin) కూడా పరాజయం పాలయ్యారు. కాగా దళపతి విజయ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల గెలుపొందడం విశేషం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp