|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్: నా సమస్యలు నేను చూసుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు

తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ తన వ్యక్తిగత జీవితంపై సాగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరదించారు. తనపై వస్తున్న విడాకుల వార్తలు మరియు వివాదాలపై విజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నై సమీపంలోని చెంగల్పట్టులో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, తన సమస్యల కారణంగా అభిమానులు ఇబ్బంది పడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యక్తిగత విషయాలను నేనే పరిష్కరించుకుంటాఇటీవల విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య విబేధాలు తలెత్తాయని, వారు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై విజయ్ స్పందిస్తూ.. “ఇటీవల నాకు ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందుల గురించి అభిమానులు ఆలోచించాల్సిన పనిలేదు. నా వ్యక్తిగత విషయాలను ఎలా పరిష్కరించుకోవాలో నాకు బాగా తెలుసు. మీరంతా కేవలం ప్రజా సమస్యలపైనే పోరాటం కొనసాగించండి” అని తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కోర్టుకెక్కిన సంగీత.. ఏప్రిల్ 20న విచారణమరోవైపు విజయ్ సతీమణి సంగీత కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విడాకుల కేసు ముగిసే వరకు చెన్నైలోని విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. నీలంగరై ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరితే విజయ్ తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరి 24నే సంగీత విడాకుల కోసం పిటిషన్ వేయగా, ఈ కేసుపై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది. ఆ రోజున విజయ్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp