|   
🔴 BREAKING NEWS ► Dharmendra Pradhan Resigns : కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, దేశ రాజకీయాల్లో సంచలనం PM Modi Latest Video : మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. Supreme Court Guidelines : కోర్టు వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు Police Job Aspirant Arrested : నిరుద్యోగుల బంద్ ఎఫెక్ట్.. హాస్టల్ వద్దే పోలీస్ అభ్యర్థి నవీన్ పట్నాయక్ అరెస్ట్ Delhi Police Warning : ఆందోళనకారులకు ఢిల్లీ పోలీసుల సంచలన వార్నింగ్.. ఆ తప్పు చేశారో ఇక మీ పాస్‌పోర్ట్ రద్దే
Skip to content

విద్యా సంస్థల పాత్రే విద్యార్థుల భవిష్యత్తుకు ఆధారం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్: విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. గురువారం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే, అనంతరం రిబ్బన్ కట్ చేసి విద్యాసంస్థను ప్రారంభించారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

​ఈ సందర్భంగా కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటైన ఈ పాఠశాల అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతుందని ఆకాంక్షించారు. పిల్లల బంగారు భవిష్యత్తు రూపకల్పనలో కేవలం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా కీలక బాధ్యత వహించాలని ఆయన సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని యాజమాన్యానికి దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు నరేందర్ కృష్ణ, నవీన్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే నాయకులు అడప శేషు, గుబ్బల లక్ష్మీనారాయణ, కుంటి మల్లేష్, దుబాయ్ శ్రీను, సురేష్ గుప్తా తదితరులు పాల్గొని పాఠశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp