|   
🔴 BREAKING NEWS ► BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే
Skip to content

GWMC బడ్జెట్ సన్నాహక సమావేశం: అభివృద్ధికి పెద్దపీట వేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశం

వరంగల్ మహానగర పాలక సంస్థ (GWMC) కాన్ఫరెన్స్ హాల్‌లో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గౌరవ మేయర్ గుండు సుధారాణి అధ్యక్షత వహించగా, హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ గారితో కలిసి బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు కీలక సూచనలు చేశారు.

నగర అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా పక్కాగా బడ్జెట్ రూపొందించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదాయ మార్గాలను బలోపేతం చేస్తూనే, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు మేయర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కూడా సమావేశం తాలూకు వివరాలను పంచుకున్నారు.

సమావేశ ముఖ్యాంశాలు:​

పక్కా ప్రణాళిక: వచ్చే ఏడాదికి సంబంధించిన ఆదాయ, వ్యయాల అంచనాలను వాస్తవిక దృక్పథంతో సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.​

అధికారుల సమీక్ష: అకౌంట్స్ అధికారి శివలింగం, సీహెచ్‌ఓ రమేష్, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొని తమ విభాగాల నివేదికలను సమర్పించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp