Skip to content

పశ్చిమాసియా ఉద్రిక్తతలు: భారత్ నుంచి వేల సంఖ్యలో విమానాలు రద్దు. ఎన్ని వేలో తెలుసా..?

న్యూఢిల్లీ, సూర్య న్యూస్: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై దాడుల నెపంతో ఇరాన్ ఆ ప్రాంతంలోని దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ నుంచి నడిచే వేలాది విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి.

పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం కారణంగా భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కు పైగా విమానాలు రద్దయినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో వెల్లడించారు. రద్దయిన విమానాలలో భారత విమానయాన సంస్థలకు చెందినవి 4,335 ఉండగా, విదేశీ సంస్థలకు చెందిన విమానాలు 1,187 ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతే ప్రధానమని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp