|  
FLASH NEWS
Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  • 
Skip to content

Kalvakuntla Kavitha : కవితక్క పోరాటానికి ఫిదా.. జాగృతిలో చేరిన చాకలి ఐలమ్మ వారసులు.. అసలు కారణం ఇదే.

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) లోకి కీలక చేరికలు జరిగాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (Chakali Ilamma) వారసులు తెలంగాణ జాగృతిలో చేరారు. ఇనుగుర్తి మండలం, ఇనుగుర్తి గ్రామానికి చెందిన ఐలమ్మ వారసులు సట్ల పద్మ (Satla Padma), ఆమె చెల్లెలు జ్యోతి (Jyothi) కేంద్ర కార్యాలయంలో జాగృతి తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ (Dr Nalamasa Srikanth Goud) ఆధ్వర్యంలో వీరు సంస్థలో చేరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) వారికి తెలంగాణ జాగృతి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వెలుగుమట్ల (Velugumatla) లో పేదల ఇండ్లను ప్రభుత్వం కూల్చివేసినప్పుడు కవిత చేసిన పోరాటం తమకు ఎంతో నచ్చిందని వారు తెలిపారు. కవితక్కకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. నాడు భూస్వాములు, రజాకార్లకు (Razakars) ఎదురొడ్డి తమ అమ్మమ్మ చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం చేసిందని వారు గుర్తుచేశారు. ఆనాటి తమ అమ్మమ్మ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా, నేడు కవితక్క ప్రభుత్వం పైన అలుపెరుగని పోరాటం చేస్తున్నారని వారు ప్రశంసించారు. పేదల పక్షాన నిలబడుతున్న నాయకత్వానికి మద్దతుగా తాము జాగృతి అడుగుజాడల్లో నడుస్తామని వారు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp