Skip to content

AP Govt Jobs 2026 : నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు లక్షల్లో జీతం..

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) తాజాగా ఒక అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk-in Interview) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

​ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 32 స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పీడియాట్రిషియన్ పోస్టులు 17 ఉండగా కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ పోస్టులు 15 ఉన్నాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ (Contract basis) పద్ధతిలో భర్తీ చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.​

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ (MBBS) తో పాటు సంబంధిత స్పెషలైజేషన్ లో ఎండీ (MD) లేదా మెడికల్ పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC) లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి. సంబంధిత విభాగంలో వైద్యుడిగా పని చేసిన ముందుస్తు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.​ ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా భారీ వేతనం చెల్లిస్తారు. పీడియాట్రిషియన్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,10,000 జీతం ఇస్తారు. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ పోస్టుకు నెలకు రూ. 1,00,000 అందజేస్తారు.

​అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలు, విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఎక్స్ పీరియన్స్ లెటర్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. జూలై 02, 2026న ఉదయం 10:00 గంటల నుండి ఈ ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, గ్రౌండ్ ఫ్లోర్, ఐటీ పార్క్, మంగళగిరి, గుంటూరు జిల్లా (Guntur District) చిరునామాలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించబోరని అధికారులు స్పష్టం చేశారు.​నోటిఫికేషన్ పూర్తి నిబంధనలు, అప్లై చేసుకోవడానికి మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://apmsrb.ap.gov.in/msrb/ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp