|   
🔴 BREAKING NEWS ► Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో
Skip to content

Indian Railways : రైల్లో ఇంటి భోజనం తింటున్నారా.. ఒక్క రోజే 1450 కేసులు నమోదు చేసిన అధికారులు.. అసలు కారణం ఇదే.

సూర్య న్యూస్: రైలు ప్రయాణం (Train Journey) చేసే సమయంలో చాలా మంది ప్రయాణికులు తమ ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్లడం సాధారణం. ముఖ్యంగా కుటుంబంతో కలిసి వెళ్లేటప్పుడు బయటి ఫుడ్ తినడం కంటే ఇంటి భోజనానికే (Home Food) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చపాతీ, పులిహోర, ఇడ్లీ లాంటివి వెంట తీసుకెళ్తారు. అయితే ఇలా రైల్లో ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్లిన వారికి తూర్పు రైల్వే జోన్ (Eastern Railway Zone) అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.

రైళ్లలో ఇంటి ఫుడ్ తీసుకురావడంపై ఎలాంటి నిషేధం లేదు. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని బండిలోకి తీసుకువెళ్లవచ్చు. కానీ ప్రయాణికులు తిన్న తర్వాత చెత్తను బోగీలలో ఇష్టారీతిన పడేయడంపై రైల్వే అధికారులు (Railway Officials) సీరియస్ అయ్యారు. రైళ్లను పరిశుభ్రంగా (Hygienic) ఉంచేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఒకేరోజు వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు.

తూర్పు రైల్వే జోన్ పరిధిలోని వివిధ స్టేషన్లు మరియు రైళ్లలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఒక్క రోజులోనే ఏకంగా 1447 కేసులు నమోదు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి సుమారు 2 లక్షల 89 వేల 400 రూపాయల జరిమానా (Fine) వసూలు చేశారు. సీట్ల కింద, డోర్ దగ్గర, వాష్ రూమ్స్ (Washrooms) సమీపంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, వాటర్ బాటిల్స్ పడేసిన వారిని గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ తనిఖీల్లో అత్యధికంగా సీల్దా డివిజన్ (Sealdah Division) లో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 615 మంది ప్రయాణికులపై లక్షా 23 వేల రూపాయల జరిమానా వసూలు చేశారు. అలాగే హౌరా డివిజన్ (Howrah Division) లో 457 మందిపై కేసులు నమోదు చేసి 91 వేల 400 రూపాయలు ఫైన్ వేశారు. అసన్సోల్ డివిజన్ లో 217 మంది రైలు బోగీలను చెత్తతో నింపేసినట్లు గుర్తించి వారి నుంచి 43 వేల 400 రూపాయలు వసూలు చేశారు. ఇక మాల్డా డివిజన్ లో 158 కేసులకు 31 వేల 600 రూపాయల జరిమానా విధించారు.

ప్రయాణికుల భద్రత మరియు ప్రజా ఆస్తిని కాపాడే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రైల్వే శాఖ (Railway Department) తేల్చి చెప్పింది. భవిష్యత్తులో కూడా నిబంధనలు ఉల్లంఘించి రైళ్లను అపరిశుభ్రం చేస్తే ఇలాంటి దాడులు కొనసాగుతాయని ప్రయాణికులను తీవ్రంగా హెచ్చరించింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp