|  
● FLASH NEWS
Judge: 5 నెలల్లో 23 మందికి ఉరిశిక్షలు.. సంచలన జడ్జి బదిలీ  •  Gouds: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుల నియామకం  •  BRAOU: మలేషియా సదస్సులో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఆన్‌లైన్ కోర్సులపై చర్చ  •  Diplomacy: జైశంకర్ దౌత్య వ్యూహం.. యూఎస్ విదేశాంగ మంత్రి ముందే పాక్ గుట్టు రట్టు  •  SupremeCourt: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల గడువుపై కీలక ఆదేశాలు  • 
Skip to content

Telangana School Bandh : రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్.. విద్యార్థి సంఘాల కీలక నిర్ణయం!

Hyderabad, Surya News: కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister Dharmendra Pradhan) వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక రేపు (జూలై 24న) రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు (Educational Institutions Bandh) పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు.

దేశంలోని విద్యా వ్యవస్థను (Education System) తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్ చేపడుతున్నట్లు వారు స్పష్టం చేశారు.

​ఈ రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ (AISF), ఎస్ఎఫ్ఐ (SFI), ఎన్ఎస్ఈయూఐ (NSUI), పీడీఎస్ యూ (PDSU), ఏఐఎఫ్ఎస్ (AIFS), ఏఐఎస్ బీ (AISB), ఏఐపీఎస్ఈయూ (AIPSEU) తదితర ప్రధాన విద్యార్థి సంఘాలు సంయుక్తంగా కోరాయి. రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలకు అన్ని విద్యాసంస్థలు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశాయి.

పాఠశాలలు, కళాశాలల బంద్ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యాసంస్థల యాజమాన్యాలు (School Managements) స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. విద్యా రంగాన్ని కాపాడుకునేందుకు చేపట్టే ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, టి.నాగరాజు, వెంకట స్వామి, పల్లె మురళి పిలుపునిచ్చారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp