|  
● FLASH NEWS
Elections: 13కి 12 కార్పొరేషన్లు కూటమి కైవసం.. ఏ నగరంలో ఎవరు మేయర్ అంటే?  •  PawanKalyan: మురసు తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు  •  Raptadu: రాప్తాడు ఉన్మాది హేమంత్ కాలు తొలగింపు.. కఠిన సెక్షన్లతో కేసు  •  Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  • 
Skip to content

IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్

హైదరాబాద్, సూర్య న్యూస్: బ్యాంకింగ్ (Banking) రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (Public Sector Banks) ఖాళీగా ఉన్న సుమారు 11,403 బ్యాంక్ క్లర్క్ (Bank Clerk) పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ మొత్తం ఖాళీలలో తెలంగాణలో (Telangana) 191 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) 186 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (Degree) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు (Age Limit) 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలని ఐబీపీఎస్ (IBPS) స్పష్టం చేసింది.

​ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ (Application Process) నేటి నుంచి ప్రారంభం కాగా, ఈ నెల 21వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే ఎస్సీ/ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు రూ. 175, ఇతర కేటగిరీల అభ్యర్థులకు రూ. 850 గా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు గడువులోగా అధికారిక వెబ్‌సైట్ (Official Website) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థుల ఎంపిక కోసం అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్షలు (Preliminary Exams), డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు (Mains Exams) నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24,000 నుంచి రూ. 64,000 వరకు పే-స్కేల్ (Pay Scale) లభిస్తుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp