
Hyderabad, Surya News: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ (Meteorological Department) బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని తెలిపింది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వాయువ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం నాటికి ఇది అల్పపీడనంగా (Low Pressure) మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో కుండపోత వానలు దంచికొట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఏపీలోని అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. భోగాపురం, చోడవరం, వేపాడ, ఎస్ కోట తదితర ప్రాంతాల్లో భయంకరమైన పిడుగులు పడతాయని తెలిపింది. కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మిగతా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
ఇక తెలంగాణలోని (Telangana News) పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపుల (Thunderstorms) సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండకూడదని మరియు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



