|   
🔴 BREAKING NEWS ► అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ BJP MP K Laxman : 22ఏ పేరిట వేల కోట్ల దోపిడీ.. సామాన్యుల ఆస్తులపై కాంగ్రెస్ దందా: ఎంపీ లక్ష్మణ్ సంచలనం! Ministry of Education : దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు.. కేంద్ర విద్యాశాఖ కీలక నివేదిక! Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF
Skip to content

భువనగిరి ఎంపీ చామలకు న్యూజెర్సీ అసెంబ్లీ అరుదైన సత్కారం

bhuvanagiri-mp-chamala-new-jersey-assembly-honor.png
bhuvanagiri-mp-chamala-new-jersey-assembly-honor


కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాజకీయ, సామాజిక సేవలను గుర్తిస్తూ న్యూజెర్సీ రాష్ట్ర జనరల్ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం ద్వారా ఘనంగా సత్కరించింది.

గార్డెన్ స్టేట్ పర్యటనలో ఉన్న ఆయన సేవలను కొనియాడుతూ అసెంబ్లీ సభ్యుడు డేనియల్సన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, 18వ లోక్‌సభకు ఎన్నికైన తీరును ఈ సందర్భంగా ప్రశంసించారు. పట్టణాభివృద్ధి, వ్యవసాయం, యువత సాధికారత, సామాజిక సంక్షేమం కోసం కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషికి గాను అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం స్పీకర్ సంతకం చేసిన అధికారిక తీర్మాన ప్రతిని ఎంపీకి అందజేశారు.

ఈ సత్కారం పట్ల ఎంపీ చామల హర్షం వ్యక్తం చేశారు. న్యూజెర్సీ అసెంబ్లీకి, సభ్యుడు డేనియల్సన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు మాత్రమే కాకుండా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తూ, భారత్–అమెరికా సంబంధాల బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp