‘వరుస’ చోరీలు కాదని ఎస్సై రాంబాబు ప్రకటన

మర్రిగూడ: మండలంలోని శివన్నగూడెం, ఖుదాబక్ష్పల్లి గ్రామాల్లో కలకలం రేపిన చోరీల ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నేరం జరిగిన ప్రాంతాలను దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాస రావు స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో 3 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
సామాజిక మాధ్యమాల్లో వస్తున్నట్లు ఇవి ‘వరుస చోరీలు’ కావని, ఒకే రోజు జరిగిన ఘటనలని మర్రిగూడ ఎస్ఐ రాంబాబు స్పష్టం చేశారు. బాధితులు అందుబాటులో లేకపోవడం వల్లే వేర్వేరు రోజుల్లో ఫిర్యాదులు అందాయని, ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ రోజులు ఊరు వెళ్లేటప్పుడు పోలీసులకు లేదా ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో పాటు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



