|  
FLASH NEWS
Telangana Politics : సంతోష్, హరీష్ రావులనైనా క్షమిస్తా కానీ ప్రశాంత్ రెడ్డిని వదలను: కల్వకుంట్ల కవిత  •  AP Deputy CM Pawan Kalyan : పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం తప్పనిసరి.. ఏపీ డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు  •  Asaduddin Owaisi : ప్రధాని మోడీ ఉజ్బెకిస్థాన్ అవార్డుపై అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు  •  టార్గెట్ ‘సరిహద్దు’.. నిఘా నిల్.. చోరీలు ఫుల్..  •  Vijay Sai Reddy : నెంబర్ 1 సజ్జల, నెంబర్ 2 జగన్.. 74 అవమానాలు భరించలేకే కొత్త పార్టీ.. విజయసాయిరెడ్డి సంచలన లేఖ  • 
Skip to content

రంగంలోకి డీఎస్పీ..ఇళ్ల చోరీలపై ముమ్మర దర్యాప్తు

‘వరుస’ చోరీలు కాదని ఎస్సై రాంబాబు ప్రకటన

WhatsApp Image 2026 08 31 at 6.41.33 PM

మర్రిగూడ: మండలంలోని శివన్నగూడెం, ఖుదాబక్ష్‌పల్లి గ్రామాల్లో కలకలం రేపిన చోరీల ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నేరం జరిగిన ప్రాంతాలను దేవరకొండ డీఎస్పీ ఎంవీ శ్రీనివాస రావు స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో 3 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

సామాజిక మాధ్యమాల్లో వస్తున్నట్లు ఇవి ‘వరుస చోరీలు’ కావని, ఒకే రోజు జరిగిన ఘటనలని మర్రిగూడ ఎస్‌ఐ రాంబాబు స్పష్టం చేశారు. బాధితులు అందుబాటులో లేకపోవడం వల్లే వేర్వేరు రోజుల్లో ఫిర్యాదులు అందాయని, ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువ రోజులు ఊరు వెళ్లేటప్పుడు పోలీసులకు లేదా ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో పాటు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp